Farmers across India are set to go on a 10-day nirasana again, a year after a first wave of farmer roiled the country.
తాము పండించిన పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో కడుపు మండిన రైతన్నలు సమ్మెకు దిగారు. పాలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను శుక్రవారం నుంచి(జూన్1) 10రోజులపాటు అందించబోమని తేల్చి చెప్పారు. రైతుల బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పోలీసులు భద్రతను పెంచారు. చమురు ధరలు పెరగడం, రైతులకు ప్రభుత్వాలు రుణమాఫీ చేయకపోవడం, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ వేదికగా ఏకమై పలు సంఘాలు శుక్రవారం నుంచి 10రోజులపాటు సమ్మె నిర్వహిస్తున్నాయి.
స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను హైవేలపై నిలిపేసి నిరసన చేపట్టారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.