బాబును కూడా ఇవే నీళ్లు తాగమనండి: నిప్పులు చెరిగిన పవన్!

2018-06-01 603

Jana Sena chief Pawan Kalyan slammed both the Centre and the State Governments for not giving special status to Andhra Pradesh. Addressing a meeting as part of his Porata Yatra in Vizianagaram, Pawan Kalyan said that only Jana Sena has reaised this voice from the beginning.

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలను తీర్చడం కంటే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పైనే ఆ పార్టీ ఎక్కువగా దృష్టి పెడుతోందని తాజా పర్యటనలో విమర్శించారు.జనసేన పోరుయాత్రలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పవన్ పర్య టించారు.
పార్వతీపురంలో నిరసన కవాతు నిర్వహించిన పవన్.. స్థానిక నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెచ్చి ఇచ్చిన నీళ్ల బాటిళ్లను చూపిస్తూ.. వారి దయనీయ స్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఇవే నీళ్లు తాగమని చెప్పాలని ప్రజలకు సూచించారు. అప్పుడు కానీ ఇక్కడి వారి బాధలు ఆయనకు తెలిసిరావన్నారు. ఇంత కలుషితమైన నీటిని తాగితే కలరా, అంటువ్యాధులు రాకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు. పార్వతీపురానికి టీడీపీ నేతలు ఎవరు వచ్చినా ఇవే నీళ్లు ఇవ్వాలని అన్నారు. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Videos similaires