The Pro Kabaddi League (PKL) 2018 Auction ended on Thursday. During the course of two days, 200 players were drafted into the 12 PKL teams for Pro Kabaddi League season 6.
ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 6వ సీజన్ వేలం గురువారంతో ముగిసింది. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో భారత్‌కు చెందిన ఐదుగురు కబడ్డీ ఆటగాళ్లు రూ.కోటికిపైగా ధర పలికి చరిత్ర సృష్టించారు. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 422 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి.
తొలిరోజు జరిగిన వేలంలో రైడర్ మను గోయత్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గోయత్‌ను హర్యానా స్టీలెర్స్ రూ. 1.51 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. 200 మందికి పైగా ఆటగాళ్లు బుధవారం వేలంలోకి వచ్చిన వేళ స్టార్ రైడర్ రాహుల్ చౌదరీని తెలుగు టైటాన్స్ రూ.1.29 కోట్లకు సొంతం చేసుకుంది.