Aamir Khan, who's loved by millions of fans, got slammed for sharing a picture with daughter Ira Khan. In the picture, daughter Ira is seen in a playful mood with Aamir Khan and it seems the picture didn't go well with Aamir's fans and they ended up bashing Aamir Khan for the same.
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సోదరుడు మన్సూర్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుక ఇటీవల ముంబై సమీపంలో ఫాం హౌస్‌లో జరిగింది. అమీర్ ఖాన్ కుటుంబం మొత్తం ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను అమీర్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఇందులో తన కూతురు ఇరా ఖాన్‌తో దిగిన ఫోటో వివాదాస్పదం అయింది. ఈ ఫోటో సరిగా లేదని, తప్పుడు ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉందని కొందరు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి ఫోటో షేర్ చేసి ఉండకూడదనే మరికొందరు సూచించారు.
వివాదానికి కారణమైన ఫోటో ఇదే. ఫాం హౌస్‌లో సరదాగా తన ఫ్యామిలీ, పిల్లలతో గడుపుతుండగా తీసిన ఫోటో. ఈ ఫోటోపై వేలాది కామెంట్లు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందించారు. కొందరు అమీర్ ఖాన్ మీద తిట్ల వర్షం కురిపించారు.
ముంబై సమీపంలోని ఫాం హౌస్‌లో తన భార్య, కుమారుడితో కలిసి ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్న అమీర్ ఖాన్.
ఫాం హౌస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్న అమీర్ ఖాన్,.