Deepika Padukone Again Acts With Vin diesel

2018-05-31 1

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరో హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. 2017లో విన్ డీజెల్ హీరోగా వచ్చిన హాలీవుడ్ మూవీ 'XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' చిత్రంలో నటించిన ఈ బెంగుళూరు బ్యూటీ త్వరలో రాబోతున్న మరో XXX సీక్వెల్‌లో కూడా నటించబోతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ దర్శకుడు డిజె కరుసో గతంలోనే ప్రకటన చేశారు. తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సారి తన చిత్రంలో బాలీవుడ్ పాపులర్ లుంగిడాన్స్ కూడా పెట్టబోతున్నాడట.
షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీలో లుంగీ డాన్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మధ్య ‘XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' ప్రమోషన్లో భాగంగా ఇండియాకు వచ్చిన విన్ డీజిల్‌తో కూడా దీపిక ఈ డాన్స్ చేయించింది.
దర్శకుడు డిజె కరుసో తన తాజా ట్వీట్లో....తను తీయబోయే xxx4 సినిమాను లుంగీ డాన్స్ సాంగ్‌తో ముగించబోతున్నట్లు తెలిపారు. ఆయన ట్వీట్ బట్టి సినిమా చివర్లో లుంగీ డాన్స్ సీన్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.