Cricket Corruption 'Goes Right To The Top', Says Arjuna Ranatunga

2018-05-31 38

World Cup-winning skipper Arjuna Ranatunga on Wednesday said that corruption "goes right to the top" in Sri Lanka and accused the International Cricket Council of undermining the game by failing to tackle match-fixing.
#cricket
#corruption
#srilanka
#arjunaranatunga
#MatchFixing


శ్రీలంక క్రికెట్‌లో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వ్యాఖ్యానించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరగకుండా చూడటంలో పూర్తిగా విఫలమవుతోన్న ఐసీసీ క్రికెట్ పరువును దిగజారుస్తోందని వెల్లడించాడు.
తాజాగా, పిచ్ ఫిక్సింగ్‌పై దోహాకు చెందిన 'ఆల్‌ జజీరా' అనే న్యూస్ ఛానల్ 'క్రికెట్స్‌ మ్యాచ్‌ ఫిక్సర్స్‌' పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఫిక్సింగ్‌లో శ్రీలంక ఆటగాడు, గ్రౌండ్స్‌మ్యాన్ పాత్ర ఉందని స్పష్టం చేస్తూ ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.
గాలేలో 2017, జులై 26 నుంచి 29 వరకు జరిగిన భారత్‌-శ్రీలంక టెస్టు మ్యాచ్‌, రాంచీలో 2017, మార్చి 16-20 మధ్య జరిగిన భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు, చెన్నైలో 2016, డిసెంబర్‌ 16-20 మధ్య జరిగిన భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు గురయ్యాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.