Nagarjuna Interview About Officer Movie

2018-05-31 368

Officer is an upcoming 2018 Telugu, Action Crime film, produced and directed by Ram Gopal Varma on his R Company Production banner. The film stars Nagarjuna Akkineni, Myra Sareen in the lead roles and music composed by Ravi Shankar.
#Officer
#NagarjunaAkkineni

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల లిస్టులో సుధీర్ఘ కాలం తన ప్రయాణం కొనసాగించిన, ఇప్పటికీ కొనసాగిస్తున్న స్టార్ అక్కినేని నాగార్జున. ఆయన ఇన్ని రోజులు ఇండస్ట్రీలో హీరోగా ఇంకా స్టాండ్ అయి ఉండటానికి కారణం ట్రెండుకు తగిన విధంగా, తన వయసుకు సూటపయ్య పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగడమే. దీనికి తోడు వయసు పెరిగినా తరగని గ్లామర్ ఆయనకు ప్లస్ పాయింట్. జూన్ 1న 'ఆఫీసర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మన్మధుడు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసూక్తికర విషయాలు వెల్లడించారు.
వర్మ తీసుకొచ్చిన ఆఫీసర్ కథ నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిజం ఉన్న సినిమా ఇది. శివాజీ రావు అనే పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది. నిజాయతీ, ముక్కుసూటితనం, వ్యవస్థపై గౌరవం, ఏదైనా సరే తొణక్కుండా చేసే లక్షణం ఆ పాత్రలో కనిపిస్తాయి. దీనికి తోడు తండ్రీ కూతుర్ల ఎమోషన్‌ నన్ను కట్టిపడేసింది. నువ్వు పూర్తి ఫోకస్ సినిమాపైనే పెట్టాలని వర్మకు షరతు పెట్టాను. అతడు ఒకే చెప్పడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని నాగార్జున తెలిపారు.
వరుస ప్లాపులు తీస్తున్న రామ్ గోపాల్ వర్మతో చేయడానికి పెద్ద హీరోలు భయపడుతున్నారు. ఈ సినిమా ఒప్పుకోవడం మీకు రిస్క్ అనిపించలేదా? అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ.... ‘నా కెరీర్లో చాలా రిస్క్‌లు ఫేస్ చేశాను. హిట్ తీసిన దర్శకుడితో సినిమా చేసినా ఆడని సందర్భాలు ఎన్నో. ‘నిన్నే పెళ్లాడతా' తరవాత కృష్ణవంశీతో చేసిన సినిమా ఇది. మంచి టెక్నీషియన్లు పని చేశారు. అయినా సినిమా ఆడలేదు. అదే సమయంలో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేసిన ‘సోగ్గాడే' బాగా ఆడింది... ఇలాంటివి నా కెరీర్లో ఎన్నో జరిగాయి' అన్నారు.