Sanjjanaa Galrani photo shoot goes viral. Sanjjanaa poses for out of focus magazine
#Sanjjanaa
అవకాశాలు తగ్గిన సమయంలో హీరోయిన్లు గ్లామర్ ఆయుధాన్ని ఉపయోగిస్తారు. తెలుగు, కన్నడలో పలు చిత్రాల్లో మెరిసిన సంజన సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా ఈ బ్యూటీ పోషించింది. అయినా కూడా అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పాలి. తాజాగా సంజన అవుట్ ఆఫ్ ఫోకస్ అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో ఈ భామ అందాలు సెగలు పుట్టించేవిగా ఉన్నాయి. సంజనని ఇంతటి గ్లామర్ లుక్ లో ఈ మధ్య కాలంలో కనిపించలేదు.
సంజన కన్నడ చిత్రాల ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో సంజన నటించిన తొలి చిత్రం బుజ్జిగాడు. ప్రభాస్ సినిమా కావడంతో ఈ చిత్రం ద్వారా సంజనకు మంచి గుర్తింపు లభించింది.
అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సంజన డీ గ్లామర్ రోల్స్ కు సైతం ఒకే చెప్పింది. ఆ క్రమంలోనే దండుపాళ్యం 2 లో సంజన నటించింది. గ్లామర్ కు ప్రాధాన్యత లేని చిత్రం కావడంతో సంజనకు ఈ చిత్రం వలన ఏమీ ఒరగలేదు.