Many fans of Naga Chaitanya and Samantha were wondering about the cryptic tattoo of Chay that is inked on his left forearm. The curious fan found that the tattoo is actually a morse code, and when Harshita deciphered the code the user found that the tattoo actually denotes the wedding date of Chaitanya and Samantha, which is 6-10-17.
అక్కినేని స్టార్ నాగ చైతన్య చేతిపై కొన్ని రోజులుగా ఓ వింత టాటూ దర్శనమిస్తోంది. సాధారణంగా టాటూలుగా అందమైన డిజైన్స్ లేదా ఏదైనా సింబల్స్ వేసుకుంటారు. అయితే చైతూ వేయించుకున్న టాటూ ఈ కేటగిరీలకి చెందినది అయితే కాదు. చుక్కలు చుక్కలుగా ఏదో సీక్రెట్ సందేశంలా ఉండటంతో ఎవరికీ దాని అర్థం ఏమిటో తెలిసేది కాదు. దీనిపై రీసెర్చ్ చేసిన ఓ అభిమాని విషయం కనిపెట్టేశాడు. "చైతన్య చేతిపై ఉన్న టాటూ మార్స్ కోడ్ అంటారు. దాని అర్థం 6-10-17.... అంటే మీ పెళ్లి జరిగిన తేదీ. నేను చెప్పింది నిజమే కదా?" ఒక వేళ తప్పయితే అసలైన అర్థం ఏమిటో వెల్లడించండి.... అంటూ హర్షిత అనే అభిమాని సమంతకు ట్వీట్ చేశారు.
అభిమాని చేసిన ట్వీట్‌పై సమంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ....'నీకు చాలా ఆసక్తిగా ఉందే?' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే టాటూ అర్థం నిజమేనా? కాదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గతేడాది సమంత, నాగ చైనత్య వివాహం గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల్లో రెండు సార్లు వివాహం చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.