కర్ణాటకలోని కరావళి (కోస్తా తీర ప్రాంతం)లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు మహిళలు, చిన్నారి, కన్నడ సినీ దర్శకుడు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రూ. కొన్ని కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.