కరీంనగర్ లో ఘూర ప్రమాదం...లారీ బస్సును చీల్చేసింది..

2018-05-30 3

Eight persons were killed and 15 others sustained serious injuries when the TSRTC bus collided head on with a lorry coming in the opposite direction in Chenjerla village of Manakondur mandal on Tuesday morning.

హుజూరాబాద్‌ డిపోకి చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు మంగళవారం ఉదయం కరీంనగర్‌ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో చెంజర్ల గ్రామం వద్దకు చేరుకోగానే.. వరంగల్‌ వైపు వెళ్తున్న ఓ లారీ బస్సును ఢీకొట్టింది. ముందు వెళ్తున్న మరో లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో.. బస్సును మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో సీట్లలో కూర్చున్నవాళ్లు సీట్లలోనే చనిపోయారు. మరికొంతమంది కాళ్లు చేతులు తెగిపడి విలవిల్లాడిపోయారు. ప్రమాద సమయంలో బస్సు వెనకాల బైక్ పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 51మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో సైదాపూర్‌కు చెందిన పేరాల ప్రభాకర్‌(56), జమ్మికుంటకు చెందిన కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ గుండ హరిప్రసాద్‌(31), హన్మకొండలోని గోపాల్‌పూర్‌కు చెందిన రాయబారపు సుభాషిణి(42), మానకొండూర్‌ మండలం ముంజంపల్లికి చెందిన గృహిణి పిల్లి లక్ష్మి(60), వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలికి చెందిన ప్రైవేటు ఉద్యోగి అయిలోని నాగరాజు(28), హైదరాబాద్‌ ముషీరాబాద్‌కు చెంది న జాకీర్‌ అహ్మద్‌ (42), వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటకు చెందిన రైల్వే డిప్యూటీ సీఈ రాజేశ్‌ పటేల్‌ ఉన్నారు.
లారీ డ్రైవర్‌, బస్సు డ్రైవర్‌ సహా మొత్తంగా 30 మంది క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రికి తరలించారు. లారీ బస్సును ఢీకొట్టిన సమయంలో బస్సుపై ఉన్న ఓ విడిభాగం విరిగి సైకిల్ పై వెళ్తున్న ఉమర్ అనే యువకుడిపై పడటంతో అతనికి బలమైన గాయమైంది. లారీ డ్రైవర్‌ అజయ్‌శర్మ(42)కు కాలు, చేయి విరిగాయి. బస్సుడ్రైవర్‌ గోపు యుగంధర్‌రెడ్డి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.
#karimnagar
#Roadaccident
#manakondur
#etelarajender