నాకే ఆ పరిస్థితి ఉంటే..ఇక సామాన్యుల గతి ఏంటి?:పవన్

2018-05-30 2

Janasena President Pawan Kalyan alleged that CM Chandrababu Naidu and his government is fully corrupted. He said Amaravati is the city for only TDP leaders not for common man.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు సీఎం అని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 'దమ్ముంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలి, ఎన్టీఆర్‌ ఫోటో పెట్టకోకుండా ఎన్నికల ప్రచారం చేపట్టాలి' అని సవాల్‌ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పోరుయాత్రలో భాగంగా పవన్‌ మంగళవారం జిల్లా కేంద్రంలో కవాతు నిర్వహించారు. అనంతరం సింహద్వారం వద్ద ఓ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు
ఇప్పటివరకు ఏ ఎన్నికలను పరిశీలించినా టీడీపీ ఏదో ఒక పార్టీతో జతకలిసే పోటీ చేసిందని పవన్ పేర్కొన్నారు. కానీ జనసేన మాత్రం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. అన్నీ కుదిరితే తాను శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. చంద్రబాబుకు కృష్ణా జిల్లాపై ఉన్న మక్కువ.. ఇతర జిల్లాలపై లేదని విమర్శించారు. అమరావతి కేవలం టీడీపీ వాళ్ల కోసమేనని, అక్కడ సామాన్యులకు చోటు లేకుండా చేశారని మండిపడ్డారు.
'రూ.25 కోట్ల ఆదాయపు పన్ను కట్టిన నాలాంటి వాడికే రాజధానిలో కొంత స్థలం కొనడానికి 4 ఏళ్లు పట్టింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?' అని పవన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అభివృద్దినంతా ఒకేచోట కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే రాష్ట్రం ఇంకోసారి మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు.
#pawankalyan
#chandrababunaidu
#andhrapradesh
#tdp
#janasena
#uddanam

Videos similaires