The synergy between entertainment brands and IPL teams as a natural one. First there is the exposure through brand logos everywhere from television to team jerseys.
#cricket
#ipl2018
#Popularity
రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకుని చెన్నై లీగ్‌లోకి పునరాగమనం చేయడంతోనే లీగ్‌కు ఒక కళొచ్చింది. ఫ్రాంచైజీలన్ని కొత్తగా ముస్తాబైయ్యాయి. అసలు ఐపీఎల్-11 ఆరంభ పోరే సూపర్ హిట్. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ పోరులో చివరి ఓవర్లలో కళ్లు చెదిరే విధ్వంసంతో చెన్నైని గెలిపించి సంచలనం రేపాడు బ్రావో. ఆ తర్వాత ఇలా అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టి, ఉత్కంఠతో ఊపేసిన పోరాటాలు ఎన్నెన్నో కనిపించాయి.
ఐపీఎల్ 11వ సీజన్ మొత్తం 60 మ్యాచ్‌ల్లో సగానికి పైగా చివరి ఓవర్ వరకు రావడం విశేషం. ప్లేఆఫ్ బెర్తుల కోసం జట్ల మధ్య సాగిన ఉత్కంఠ అభిమానిని కట్టిపడేసింది. ప్రతిసారీ లీగ్ మూడొంతుల భాగం పూర్తయ్యేసరికి రెండు మూడు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునేవి. కానీ ఈసారి ఢిల్లీ మినహా అన్నీ రేసులో నిలిచాయి.
ఐపీఎల్‌లో ఏకంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. అన్నింటికీ దాదాపుగా స్టేడియాలు నిండుగా కనిపించాయి. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రం స్టేడియాలు ఖాళీగా ఉంటున్నాయి. టెస్టుల సంగతి చెప్పాలంటే సరేసరి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో జట్ల మధ్య పోటీతత్వం తగ్గడంతో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఏ జట్టూ అంత భీకరంగా లేదు. ప్రతి జట్టూ సొంతగడ్డపై తమకు నప్పే పిచ్‌లను తయారు చేసుకుని ప్రత్యర్థుల్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా పెట్టుకుంటోంది.