Sri Reddy Visits Tirumala & Reveals Her Future Plan

2018-05-29 428

Actress SriReddy visits Tirumala. SriReddy revelas why she visited Tirumala
#SriReddy
#Tirumala

సంచలన నటి శ్రీరెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డిపై ఇటీవల మీడియా ఫోకస్ తగ్గించిన తరువాత సోషల్ మీడియా వేదికగానే ఆమె తన సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ పై, ఆయన తల్లిపై శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగిన తరువాత ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తరువాత శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం మరుగున పడిపోయింది. త్వరలో ఢిల్లీ స్థాయిలో తన పోరాటాన్ని ప్రారంభిస్తానని శ్రీరెడ్డి చెబుతోంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కూడా శ్రీరెడ్డి ఇదే వ్యాఖ్యలు చేసింది.
శ్రీవారిని నడకదారిని వచ్చి దర్శించుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది. తన పోరాటానికి ఇటీవల అవాంతరాలు ఏర్పడ్డాయని శ్రీరెడ్డి తెలిపింది. శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన పోరాటం ముందుకు సాగాలని కోరుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది.
తన కాస్టింగ్ కౌచ్ పోరాటం ఢిల్లీస్థాయిలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నానని శ్రీరెడ్డి తెలిపింది. ఈ పోరాటం విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో కొన్ని రాజకీయ పరమైన కోరికలు కూడా కోరుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది.