Abhishek Bachchan Tweets About Food To Aishwarya Rai Bachchan

2018-05-29 943

How many of you hate green veggies in your food? If yes, then you have something common with Abhishek Bachchan. Recently the actor professed his profound dislike for broccoli on his Twitter page. Poor Abhi! He wasn't aware what was in store for him next!. To the actor's surprise, soon after his tweet, his wife Aishwarya Rai Bachchan, served him quinoa salad with broccoli and tomatoes for a meal.
#AishwaryaRaiBachchan
#AbhishekBachchan

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ట్విట్టర్లో జరిగిన ఓ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బ్రకోలిని ఛీ కొడుతూ అభిషేక్ తన ట్వీట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు చేశారు.వెజిటబుల్స్‌లో ఇది తనకు అస్సలు నచ్చదని, అదంటే అసహ్యం అంటూ పేర్కొన్నారు.దీనికి తన భార్య ఐశ్వర్యరాయ్ ఎలా రియాక్ట్ అయిందో వెల్లడిస్తూ అభిషేక్ మరో పోస్టు చేశారు. ఈ ట్వీట్స్ చూసిన అభిమానులు భర్తకు ఐశ్వర్యరాయ్ తగిన పనిష్మెంట్ ఇచ్చింది అంటూ జోకులేసుకుంటున్నారు.
ఎందుకు? ఎవరైనా ఇలా చేస్తారా? అసలు బ్రకోలీ అంటే ఇష్టపడేవాళ్లు కూడా ఉంటారా?' అంటూ బ్రకోలిపై తన అయిస్టాన్ని వెల్లడిస్తూ అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్‌ చేశారు.
ఎన్నో పోషకాలను ఇచ్చే, ఆరోగ్యకరమైన బ్రకోలి గరించి అభి అలాంటి కామెంట్ చేయడంతో..... దాని విలువ తెలిసేలా బ్రకోలి, టమోటోలతో ఐష్ ఓ ప్రత్చేక వంటకం తయారు చేసి భర్తకు వడ్డించింది. ఆ వంటకం ఫొటోను అభి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘మా ఆవిడ నా ట్వీట్‌ చదివినట్లుంది, అందుకే దీన్ని నాతో బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తోంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ అభికి ఐష్ తగిన పనిష్మెంట్ ఇచ్చింది అంటూ చర్చించుకుంటున్నారు.
ఐశ్వర్యరాయ్ ఇంకా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయలేదు. అయినప్పటికీ అభిషేక్ ట్విట్లపై ఆమె కన్నేసి ఉంచిందని ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు సోషల్ మీడియాలో అభి ప్రతి యాక్టివిటీని ఐష్ ఎప్పుడూ మనిటరింగ్ చేస్తూ ఉంటుందట.