Ravi Teja starrer Nela Ticket is collecting very less in terms of the box office collections. The movie has registered a below par weekend with a distributor share of over 8cr worldwide.
#NelaTicketboxofficecollections
#RaviTeja
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'నేల టిక్కెట్' మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదు. సినిమా తొలి రోజు నుండే మిక్డ్స్‌టాక్ రావడం, క్రిటిక్స్ కూడా సినిమా యావరేజ్ అంటూ రివ్యూస్ ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద వసూళ్లు మరింత డీలా పడ్డాయి. ఈ చిత్రం తొలి 3 రోజుల్లో కేవలం రూ. 8 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఇందులో ఎక్కువ శాతం తొలి రోజు వసూలైందే కావడం గమనార్హం. రెండో రోజు నుండి కలెక్షన్స్ క్రమక్రమంగా డౌన్ అవుతున్నాయి. ఫస్ట్ వీకెండే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నేల టిక్కెట్టు' ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలకు కలిపి రూ. 22 కోట్లకు అమ్మారు. ఫస్ట్ వీకెండ్ సగం షేర్ కూడా రాక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకు రూ. 8 కోట్లు వచ్చాయి. ఇంకా 14 కోట్ల షేర్ వసూలైతే తప్ప బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంటుంది. అంతకు మించి వసూలైతేనే లాభాలు వస్తాయి.
నైజాం, ఆంధ్రప్రదేశ్ ఏరియాల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 6.77 కోట్ల షేర్ వసూలైంది. ఇందులో రూ. 3.49 కోట్లు తొలి రోజు వచ్చిన అమౌంటే కావడం గమనార్హం. నైజాంలో రూ. 2.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 63 లక్షలు, కృష్ణలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలు, ఈస్ట్ లో రూ. 63, లక్షలు, వెస్ట్‌లో రూ. 42 లక్షలు రాబట్టింది.
ఓవర్సీస్‌లో పరిస్థితి మీ దారుణంగా ఉంది. తొలి 3 రోజుల్లో కేవలం 20 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే రెస్టాఫ్ ఇండియాలో 1.15 కోట్లు రాబట్టింది.