Ram Gopal Varma Hilarious Speech in Officer Pre Release Event

2018-05-29 527

RGV Emotional Speech at Officer Movie Pre Release Event. Officer 2018 latest Telugu movie ft. Nagarjuna and Myra Sareen. Directed by RGV and Music composed by Ravi Shankar and produced by Ram Gopal Varma and Sudheer Chandra under A Company Production.
#OfficerMoviePreReleaseEvent
#RGV

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆఫీసర్'. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శివ' ట్రెండ్ సెట్టర్. దాదాపు పాతికేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 1న 'ఆఫీసర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపత్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్‌గా ప్రసంగించారు.
రామ్ గోపాల్ వర్మ ప్రసంగించేందుకు వేదికపైకి వస్తుండగా కొంతమంది ఫారిన్ అమ్మాయిల గ్రూపు ఆయన్ను స్టేజీ మీదకు తీసుకొచ్చింది. దీనిపై వర్మ స్పందిస్తూ... దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను ఫారిన్ అమ్మాయిల ఐడియా నాది కాదు. ఇది నా యూనిట్లో ఉండే వారు నా మీద కుట్ర పన్ని చేశారు. ఈ విషయాన్ని నాగార్జున నమ్మితే చాలు. నా మీద కుట్ర పన్నినోళ్ల సంగతి తర్వాత చూస్తాను. అని వ్యాఖ్యానించారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సీన్ కావాలనే క్రియేట్ చేశారని, తనపై ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పరోక్షంగా ఒక సందేశం పంపేందుకు వర్మ ఇలా సెట్ చేశాడని చర్చించుకుంటున్నారు.