MadhaviLatha commets on Mahesh Babu. Telugu heroines did not get chances for these reasons
#MadhaviLatha
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని, కాస్టింగ్ కౌచ్ ఉందని మొదట గళం విప్పిన నటి మాధవి లత. శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ పోరాటానికి కూడా మాధవి లతా మద్దత్తు తెలిపింది. కానీ ఆమె విచిత్ర వైఖరితో మాధవీలత పక్కకు తప్పుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకు అవకాశాల గురించి తన అభిప్రాయం వెల్లడించింది. తెలుగు నటీమణులని చిన్న చూపు చూస్తారని మాధవి లతా గతంలో టాలీవుడ్ గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు రావడం లేదో మాధవీలత తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
కొన్ని రోజుల క్రితం తాను మహేష్ బాబుని ఉద్దేశించి చేసిన కామెంట్ ని మాధవీలత తిరిగి ప్రస్తావించింది. తెలుగు అమ్మాయిలకు మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందా, గ్యారెంటీ ఇవ్వగలరా అంటూ మాధవీలత ప్రశ్నించింది.
పదేళ్ల క్రితం మహేష్ బాబు సినిమాలో తాను క్యారెక్టర్ రోల్ చేసానని, అలాంటి పాత్రలని మాత్రం తెలుగు అమ్మాయిలకే ఇస్తారని మాధవీలత అభిప్రాయ పడింది. హీరోయిన్ గా మాత్రం అవకాశం ఇవ్వరు అని తెలిపింది.
మేము డబ్బు పెడుతున్నాం, టాలెంట్ ని ఎక్కడినుచైనా తెచ్చుకుంటాం అని నిర్మాతలు అంటారు. కానీ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 80 శాతం అక్కడి అమ్మాయిలకే అవకాశాలు వస్తున్నాయని మాధవీలత తెలిపింది.
మన నిర్మాతలకు పక్కింటి పుల్లగూర రుచిగా ఉటుందని మాధవీలత తెలిపింది. ఎలాంటి మార్కెట్ లేని పరభాషా హీరోయిన్లని తెచ్చుకుంటారు. తెలుగు అమ్మాయిలు దొరకడం లేదు, రూల్స్ పెడతారు అని సాకుగా చెబుతున్నారని వ్యాఖ్యానించింది.