IPL is one of the most entertaining sporting events in India with 8 teams fighting for that covered winning trophy.Each year, teams making it to the Finals have to play through 14 league matches & playoffs.
#ipl2018
#iplwinners
#sunrisershyderabad
#chennaisuperkings
ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది.
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలవడం... అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 2008లో ఆరంభమైన ఈ లీగ్‌కు క్రికెట్ ప్రేమికులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతిఏడాది టోర్నీ విజయవంతంగా సాగుతోంది. ఐపీఎలో 11వ సీజన్ ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి విజేతల వివరాలు మీకోసం..
2018: చెన్నై సూపర్ కింగ్స్
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలోని చెన్నై వాంఖడెలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8వ వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.
2017: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ పదో సీజన్‌ను ప్రేక్షుకలను ఎంతగానో అలరించింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పుణేపై 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని చివరి బంతికి విజయం సాధించింది.