IPL 2018: Andrew Tye Finishes As The Tournament's Leading Wicket Taker

2018-05-29 77

A look at the top five wicket takers in the 2018 Indian Premier League season. KXIP's Andrew Tye is the tournament's highest wicket taker with 24 wickets from 14 matches.

ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆండ్రూ టై ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై ఈ సీజన్‌లో అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఆండ్రూ టై 18.86 యావరేజ్‌తో 24 వికెట్లు తీశాడు.
దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌ని ఆండ్రూ టై సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన పంజాబ్ జట్టు ఐపీఎల్ మలి దశలో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, ఆ జట్టు పేసర్ ఆండ్రూ టై మాత్రం చక్కటి ఆటతీరు కనబర్చాడు.
దీంతో గత పదకొండేళ్ల ఐపీఎల్ చర్రితలో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా ఆండ్రూ టై రికార్డు నెలకొల్పాడు. షేన్ వార్న్, బ్రెట్ లీ లాంటి ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా జట్టులో ఐపీఎల్‌లో తలపడినప్పటికీ వారికెవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను ఆండ్రూ టై అందుకున్నాడు.