Renu Desai shares cute pic of Akira and Adhya. Renu Desai emotional comments
#RenuDesai
#Akira
#Adhya
వన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పిల్లలు అకిరా, ఆద్యతో పుణేలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి విడిపోయాక తన పిల్లల ఆలనా పాలనా రేణుదేశాయ్ చూసుకుంటోంది. పవన్ నుంచి విడిపోయినప్పటికీ పిల్లలకోసం వీరిద్దరూ తరచుగా కలుస్తూనే ఉంటారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అకిరా, ఆద్య గురించి సోషల్ మీడియాలో ఫాన్స్ కు తెలియజేస్తుంటుంది. రేణు దేశాయ్ తాజగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ వైరల్ గా మారింది. అకిరా, ఆద్య చాలా క్యూట్ గా ఉన్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది.
ఆద్యతో అకిరా సరదాగా ఉండగా రెండు దేశాయ్ ఈ ఫోటో క్లిక్ మనిపించింది. ఆద్య చిరునవ్వులు చిందిస్తుండగా, అకిరా అలా చెల్లెలిపై తల వాల్చి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ ఫాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది.
ఈ పిక్ తో పాటు రేణుదేశాయ్ ఓ కవితని కూడా పోస్ట్ చేసింది. చాలా ఎమోషనల్ మీనింగ్ వచ్చేలా ఈ కవిత ఉంది. నేను మీ కోసం చంపుతా, చస్తా అనే పదాలు ఉన్నాయి.
ఒక తల్లిగా ఈ మాటలు చెబుతున్నానంటూ రేణు దేశాయ్ ఈ పోస్ట్ పెట్టింది. ఇలాంటి క్యూట్ పిక్స్ చాలా ఉన్నాయంటూ రేణుదేశాయ్ చెబుతోంది.