IPl 2018 : Fitness Matters More Than Age Says MS Dhoni

2018-05-28 168

Chennai Super Kings' fairy-tale comeback is a proof that fitness matters more than age, said skipper Mahendra Singh Dhoni after guiding his team to a third IPL title.
#ipl2018
#chennaisuperkings
#sunrisershyderabad
#msdhoni

రెండేళ్ల నిషేదం అనంతరం పునరాగమనం, మరో వయసు పైబడిన వాళ్లని జట్టులోకి తీసుకున్నారంటూ విమర్శలు, ఇవే కాక లీగ్ దశలోనే కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం అవుతుండటం. అన్నింటిని నిలదొక్కుకుని అనుభవాన్ని కూడదీసుకుని జట్టు విజయం కోసం పాటుపడ్డాడు. చివరికి విజేతగా నిలిచాడు ధోనీ.. మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2018 సీజన్ ఆరంభం నుంచి జట్టును దూకుడు మీద ఫైనల్స్ వరకూ తీసుకొచ్చాడు.
మధ్యలో ఎదురైన ఆటంకాలు లెక్కచేయక లీగ్ దశ దాటి క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లోనే గెలుపొందడంతో చివరకు ఫైనల్స్ చేరింది చెన్నై. ఇదే సీజన్‌లో అంతకుముందే మూడు సార్లు ఓడించిన జట్టు హైదరాబాద్‌ను సునాయాసంగా బౌండరీలతో భయపెట్టి ట్రోఫీని గెలుచుకుంది.
‘మిస్టర్‌ కూల్‌' ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఇది మూడో ట్రోఫీ. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొంది కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో షేన్‌ వాట్సన్‌(57 బంతుల్లో 117) వీరబాదుడుకు తోడు మరో సెంటిమెంట్‌ కూడా కలిసొచ్చిందని కెప్టెన్ కూల్ చెప్పుకొచ్చాడు.
‘ఫైనల్స్‌ అనేసరికి అందరూ నంబర్లను పోల్చుకుంటూ ఉంటారు. నేనైతే నంబర్‌ 7 సెంటిమెంట్‌ కీలకంగా భావించా. మ్యాచ్ తేదీ మే 27. సాధించాల్సిన స్కోరు 179, నా జెర్సీ నంబర్‌ కూడా 7. అన్నింటికంటే మించి చెన్నై టీమ్‌ ఫైనల్స్‌కు రావడం ఇది 7వసారి. అన్ని చోట్లా 7 ఉంది. అలా కలిసొచ్చింది(నవ్వులు). అఫ్‌కోర్స్‌, సెంటిమెంట్ల సంగతి ఎలా ఉన్నా జట్టు ప్రదర్శన అనేది కీలకం' అని చెప్పాడు ధోని.