Shane Watson’s magnificent ton in the 2018 Indian Premier League (IPL) final against Sunrisers Hyderabad (SRH) powered Chennai Super Kings (CSK) to their third title at the Wankhede Stadium on Sunday.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఓ సరికొత్త రికార్డుని నమోదు చేసింది. ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగుసార్లు గెలిచి ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ సీజన్‌లో లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండుసార్లు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఒక సీజన్‌లో ఒక జట్టుపై అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక సీజన్‌లో ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓటమి పాలైన జట్టుగా నిలిచింది.
ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది. హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 117 నాటౌట్, 11ఫోర్లు, 8సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.