Irumbu Thirai (Iron Curtain) action thriller film, directed by debutant P. S. Mithran. The film features Vishal, Arjun and Samantha Ruth Prabhu in the lead roles, Yuvan Shankar Raja composing the soundtrack. Produced by Vishal Film Factory, the venture began production in October 2016. It is dubbed into Telugu as Abhimanyudu which is set to release on 1 June 2018.
విశాల్, సమంత జంటగా అర్జున్ ముఖ్య పాత్రల్లో పీయస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో జూన్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు.
అభిమన్యుడు’ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మిత్రన్ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా ఫస్ట్ సినిమా. డిజిటలైజేషన్‌కి మరో వైపు ఎలా ఉంటుందో అని ఇందులో చూపించాం. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. పాటనో ఫైట్‌నో కాకుండా సమాజంలో జరిగే విషయాల్ని ఈ సినిమాలో చూపించాం.పెళ్లైన హీరోయిన్ నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సక్సెస్ కొట్టారు’’అన్నారు. ‘‘రంగస్థలం, మహానటి’ తర్వాత తమిళంలో ‘ఇరంబుదురై’తో సక్సెస్ అందుకున్నాను.
ఇన్‌ఫర్మేషన్ థెప్ట్ గురించిన అవేర్‌నెస్‌ను కలిగిస్తూ కమర్షియల్ పంథాలో రూపొందించాం. తెలుగులోను సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. చాలా స్టైలిష్‌గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలానికి టైలర్ మేడ్ మూవీ ఇది. మిత్రన్ ఫస్ట్ సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో. అలాగే అన్‌సక్సెస్‌ఫుల్ హీరో. కానీ మా అభిమన్యుడు సక్సెస్‌ఫుల్ హీరో’’ అన్నారు అర్జున్. ఈ సినిమాకు సంగీతం:యువన్ శంకర్ రాజా.