అది సెక్స్ కాదు, చెప్పుతో కొడతా: హైపర్ ఆదిపై శ్రీరెడ్డి సంచలనం!

2018-05-28 10

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువగా పంచ్‌లు విసురుతుంటాడు. ఈ క్రమంలోనే ఆది ఇటీవల తన షోలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సంచలనం శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పంచ్‌లు విసిరారు. దీనిపై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆది మీద ఎదురు దాడికి దిగారు. ఘాటైన పదజాలంతో ఆమె ఆదిపై విరుచుకుపపడ్డారు. ఓ క్రమంలో తన కోపాన్ని ఆపుకోలేక నిన్ను బ్రతికనిచ్చేదాన్ని కాదు అంటూ వ్యాఖ్యానించారు.