Actor Ravi Kishan reveals that unsolicited advances are made towards both men and women, but it is important not to give in, even at the cost of one’s career, as there’s no future in selling oneself.
#ActorRavi Kishan
సినీ పరిశ్రమలో లైంగిక దాడులు కేవలం ఆడవాళ్లకే పరిమితం కాదని, మగవాళ్లపై కూడా ఉంటాయని ప్రముఖ నటుడు రవి కిషన్ వెల్లడించారు. అయితే వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆయన అన్నారు. అలాంటి వాటిని పట్టించుకొంటే కెరీర్ తీవ్ర ఇబ్బందిలో పడుతుందని ఆయన అన్నారు. వేషాల కోసం పడకగదికి వెళ్లే అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
సినీ రంగంలో లైంగిక వేధింపులు తప్పక ఉంటాయి. వేషాల కోసం అమ్మాయిలను పడక గదిలో రమ్మనే సంస్కృతి ఉంది. ఇది ఈ రంగానికే పరిమితం కాదు అని రవి కిషన్ అన్నారు. ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన రవి కిషన్ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ భాగం. ఇది ఓ ఆటలాంటింది. ఇలాంటి పరిస్థితుల్లో పడకుండా ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మెదులుకోవాలి. ఇలాంటి ముప్పు నుంచి ప్రతీ ఒక్కరు తమను తాము కాపాడుకోవాలి అని రవి కిషన్ అన్నారు.
సినీ పరిశ్రమలో ఇలాంటి చర్యలపై వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకరి పక్కలో పడుకొని వేషాలు సంపాదిస్తే జీవితంలో ముందుకు వెళ్లలేవు. అలాంటి పనులు చేస్తే భవిష్యత్ ఉండదు. మనల్ని మనం అమ్ముకుంటే కెరీర్‌లో పురోగతి ఉండదు అని రవి కిషన్ పేర్కొన్నారు.