Nani Makes Funny Tweets On His Movie

2018-05-26 480

Natural star Nani's latest movie is Krishnarjuna Yuddam. But this did not do well. Recently, This movie rights was taken by on youtube channel. they mentioned that Krishnajuna Yuddam was super hit. On this tweet, He tweeted that Its not hit. Its a flop.
#Nani
#KrishnarjunaYuddam

వరుస సినిమాలు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్‌ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సినిమాల్లోనే కాదు ఆయన నిజజీవితంలో చాలా హుషారుగా ఉంటారు. సరదాగా సెటైర్లు వేయడమే కాదు.. తనపై కూడా వేసుకొంటారు. అయితే హిట్లతో ముందుకెళ్తున్న నానికి ఇటీవల రిలీజైన కృష్ణార్జునయుద్ధం చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని ఇటీవల ఓ యూట్యూబ్ టెలివిజన్ ఛానెల్ ఆ చిత్రాన్ని కొనుగోలు చేసింది. ఆ క్రమంలో నాని నటించిన సూపర్ హిట్ చిత్రం 'కృష్ణార్జున యుద్దం'ను మా ఛానెల్‌లో చూడండి అని ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌పై నాని స్పందిస్తూ.. కృష్ణార్జున యుద్ధం సూపర్ హిట్ అట. మేమైతే మనసుపెట్టి చేశాం. అది హిట్ అవలేదు బాబాయ్. ఆ చిత్రం సరిగా ఆడలేదు కూడా. మీరు హిట్ చేశారు .. చేసేయండి అని నాని ట్వీట్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది.