While defending a competitive total of 174, Sunrisers pulled things back strongly in the second-half of the game and restricted KKR to 161/9 in the stipulated 20 overs.
#ipl2018
#dineshkarthik
#kanewilliamson
#kolkataknightriders
#sunrisershyderabad
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్ మళ్లీ తుదిపోరులో ఆ జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇది రెండో ఐపీఎల్ ఫైనల్స్ కావడం విశేషం.