BBC Test Match Special has secured rights to broadcast ball-by-ball coverage of the ICC Cricket World Cup 2019, to be held in England and Wales next year.
నాలుగేళ్లకోసారి క్రికెట్‌లో వచ్చే పెద్ద పండుగ వరల్డ్ కప్. వచ్చే ఏడాది అభిమానుల ముందుకు వచ్చేందుకు ఐసీసీ వరల్డ్ కప్ 2019 అంతే స్థాయిలో సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌లోని వేల్స్‌లో నిర్వహించనున్న ప్రపంచకప్‌ను అధికారికంగా ప్రసారం చేసేందుకు రేడియో ప్రసార హక్కులను బీబీసీ సొంతం చేసుకుంది.
ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న బీబీసీ సుదూర కాల ఒప్పంద నేపథ్యంలో కుదుర్చుకుంది. ఈ క్రమంలో 2023 వరకూ ఐసీసీ నిర్వహించనున్న ఈవెంట్లకు సంబంధించిన పూర్తి ప్రసార హక్కులను కలిగి ఉన్న ఛానెల్ 2 గ్రూప్ కార్పొరేషన్, ఐసీసీ గ్లోబల్ ఆడియో రైట్స్ పార్టనర్‌లతో ఒక నిర్ణయానికి వచ్చింది.
దీంతో దాదాపు ఇండియాలో జరగనున్న 2023 ప్రపంచకప్ వరకు ఐసీసీ నిర్వహించే అన్ని మెయిన్ ఈవెంట్లపై ఆ ఛానెళ్లు హక్కులను కలిగి ఉంటాయి. ఈ మధ్యలో నిర్వహించే ఐసీసీ వరల్డ్ టీ20లు, న్యూజిలాండ్‌లో 2021 ఉమెన్ వరల్డ్ కప్‌ల ఆడియో హక్కులపై పూర్తి అధికారం కలిగి ఉంటుంది.
ఈ విషయంపై ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ.. 'ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు వచ్చే ఏడాది ఫుల్ జోష్ దక్కనుంది. కెనడా వ్యాప్తంగా బీబీసీ ద్వారా బాల్ టు బాల్ కవరేజి ఇస్తుండటం ఓ గొప్ప విషయం.' అని పేర్కొన్నాడు.