Former Australia captain Steve Smith will return to cricket as a marquee player in next month's Global T20 Canada league.
#australia
#stevesmith
#canada
#Balltampering
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ త్వరలోనే మైదానంలోకి పునరాగమనం చేయనున్నారు. 12 నెలల పాటు నిషేదాన్ని ఎదుర్కొంటున్న స్మిత్.. వచ్చే నెలలో కెనడాలో జరిగే గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొననున్నారు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న వార్నర్, బాన్ క్రాఫ్ట్, స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) 12 నెలల పాటు నిషేధం విధించింది.
సరిగ్గా ఐపీఎల్ ఆరంభానికి ముందు ఇలా జరగడంతో.. బీసీసీఐ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు స్మిత్‌ను అనుమతించలేదు. నిషేధం ప్రకారం స్మిత్ జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు నిర్దేశించిన కాలం పాటు దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో స్మిత్, వార్నర్‌లు మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ అంతర్జాతీయ క్రికెట్ లో పాల్గొనకూడదు.
అయితే, ఇతర దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో ఆయా బోర్డుల అనుమతితో పాల్గొనవచ్చు. ఈ క్రమంలో గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొనడానికి స్మిత్‌కు పిలుపు వచ్చింది. ఇదే లీగ్‌లో క్రిస్ లిన్, క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది తదితర క్రీడాకారులు సైతం పాల్గొననున్నారు.