Ronaldinho To Marry Two Women At The Same Time

2018-05-25 128

The Brazilianace could tie the knot in August with his two 'fiancees' Priscilla Coelho and Beatriz Souza.
#ronaldinho
#brazilfootball
#footballworldcup
#fifaworldcup
#soccer

సహజంగానే పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వేరే వాళ్లతో చనువుగా ఉంటేనే ఊరుకోరు అమ్మాయిలు. అలాంటిది తన ఇద్దరు ప్రియురా ళ్లను.. ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాడు బ్రెజిల్‌ మాజీ స్టార్‌ ఫుట్‌బాలర్‌ రొనాల్డినో. 38 ఏళ్ల రొనాల్డినో.. మనసిచ్చిన ప్రిసి ల్లా కోయెలో, బీట్రిట్‌ సౌజాలను పరిణయమాడనున్నాడు. ఈ వేడుక ఆగస్టులో జరగనుంది.
ఈ బ్రెజిల్‌ దిగ్గజ ప్లేయర్‌ చాలా ఏళ్ల నుంచి ప్రిసిల్లాను ప్రేమిస్తున్నాడు. ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూనే 2016 నుంచి సౌజాతో డేటింగ్‌ చేస్తున్నాడు. ఈ ముగ్గురూ గత డిసెంబర్‌ నుంచి రియో డిజనీరో మాన్షన్‌లో కలిసి ఉంటున్నట్టు సమాచారం. రియోలోనే జరిగే ప్రైవేటు వేడుకలో రొనాల్డినో ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాడని బ్రెజిల్‌కు చెందిన ఓ దినపత్రిక తెలిపింది.
జనవరిలోనే పెళ్లికి ఒప్పించిన రొనాల్డినో.. వారికి ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాలు కూడా తొడిగాడట. అంతేకాదు చేతి ఖర్చులకు గాను వీరికి చెరో 1500 పౌండ్లు (సుమారు రూ. 1.37 లక్షలు) ఇస్తున్నాడట. అలాగే, ఇద్దరికీ ఒకే రకమైన బహుమతులు కొంటున్నాడట. రొనాల్డినోను ఒకేసారి పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ ఒప్పుకోవడం విశేషం. అయితే రోనాల్డిన్హో పద్ధతులు నచ్చని అతని సోదరి, తాను మాత్రం ఆ వివాహానికి హాజరుకాబోనని ప్రకటించారు.