Boney Kapoor Talks About Sri Devi Mystery

2018-05-25 583

Boney Kapoor on his life after Sridevi’s . I am trying to be both a mother and a father to my children he says
#Sridevi
#BoneyKapoor

ఈ ఏడాది ఫ్రిబ్రవరి 24 న అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య పరిస్థితుల నడుమ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం భారత సినీ ప్రేముకులందరికీ షాకింగే. ఆమెది మరణించే వయసు కాదు.పైగా చలాకీగా ఆరోగ్యంగా ఉంది. దుబాయ్ లో పెళ్ళికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడ ఓ హోటల్ లో బాత్ టబ్ లో పడి చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేని, నమ్మశక్యం కానీ విషయం. అక్కడ చోటుచేసుకున్న ఘటన గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ఆ విషయాన్నీ అణగదొక్కేశారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. శ్రీదేవి తరువాత తొలిసారి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
శ్రీదేవి మా జీవితాల నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయిందని బోనికపూర్ అన్నారు. శ్రీదేవి మరణంతో మా ఫ్యామిలి చాలా పనులు నిలిచిపోయాయని బోనికపూర్ అన్నారు.
ఇకపై తన పిల్లలకు తల్లి,తండ్రి అని నేనే అని బోనీ కపూర్ అన్నారు. వారి జీవితాలని సెటిల్ చేసేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు బోనీ కపూర్ అన్నారు. శ్రీదేవి మరణం తరువాత వాయిదా పడ్డ అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని తిరిగి ప్రారంభించి పూర్తి చేయాలని బోని అన్నారు.