కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష నెగ్గడం కష్టమే

2018-05-25 656

Karnataka chief minister HD Kumaraswamy will face a floor test on Friday, which he is widely expected to sail through, barring any unforeseeable events, ending the 10-day political uncertainty in the state.

కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్దమయ్యారు. ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో బలనిరూపణలో నెగ్గడం లాంఛనంగానే కనిపిస్తోంది. కాగా, సభలో విశ్వాసపరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎంపిక తర్వాత సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. ఆ సంఖ్య కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి ఉంది కాబట్టి బలనిరూపణలో నెగ్గడం కష్టమేమి కాదు.
యడ్యూరప్ప&కో ప్రలోభాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఇంకా రిసార్టులోనే ఉంచిన సంతి తెలిసిందే. కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలు కోరినా.. కాంగ్రెస్ అందుకు సమ్మతించలేదు. దీంతో ఎమ్మెల్యేలంతా రిసార్టు నుంచి నేరుగా అసెంబ్లీకి రానున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు సైతం ఇంకా ఓ హోటల్లోనే బస చేస్తున్నారు. ఇంటికి వెళ్తామన్న వారి అభ్యర్థనను పార్టీ తిరస్కరించినట్టు తెలుస్తోంది.

Videos similaires