While it was clear that the first finalist was the Chennai Super Kings, after their outstanding performance against Sunrisers Hyderabad in the qualifier game, it was unsure who would face Sunrisers in the eliminator on the 25th of May.
ఇప్పటికే ఐపీఎల్ 2018 సీజన్ లో ఫైనల్ మ్యాచ్ ఆడే జట్టు చెన్నై అని ఖరారైపోయింది. అయితే దానికి ప్రత్యర్థిగా ఏ జట్టు బరిలోకి దిగనుందా.. అని 2రోజులుగా ప్రతి ఐపీఎల్ అభిమాని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. అయితే దానికి సమాధానంగా హాట్ స్టార్ విడుదల చేసిన ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను హైదరాబాద్‌పై చెన్నై విజయానంతరమే హాట్ స్టార్ విడుదల చేసిందట. రాజస్థాన్, కోల్‌కతా జట్లు బరిలోకి దిగకముందే చెన్నై, కోల్‌కతాల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ వీడియో చెప్పకనే చెప్తుంది.
ఇక ఫైనల్‌లో ఆడేది చెన్నై వర్సెస్ కోల్‌కతాయే నంటూ హాట్ స్టార్ చెప్పిందట. అయితే చెన్నై జట్లు అభిమానులు ఇలా మ్యాచ్ జరగకముందే ఎలా తెలిసిపోయింది. ఇదంతా ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు గుప్పిస్తుంటే హాట్‌స్టార్ అధికారిక బృందం నోరు మెదపకుంది. ఈ వీడియో కోల్‌కతా 25పరుగుల తేడాతో రాజస్థాన్‌పై గెలవకముందే విడుదలైంది.
తర్వాతి మ్యాచ్ ఆడనున్న కోల్‌కతా, హైదరాబాద్‌ల మధ్య గట్టి పోటీనే నెలకొంది. సీజన్ ఆరంభంలో కోల్ కతా జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ తడబడిన మాట వాస్తవమే. కాగా, ఆ తర్వాత నిదానంగా పుంజుకున్న కోల్‌కతా ఏ విభాగంలోనూ పూర్తి సామర్థ్యం లేకపోయినా హైదరాబాద్‌తో పోటీ పడేందుకు సిద్ధమైపోతోంది.
హైదరాబాద్ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్, ఫీల్డింగే కావడంతో బ్యాటింగ్‌పై ఇంకాస్త మెరుగుపెట్టుకుని బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ ఇదే వీడియో నిజమైతే ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ధోనీ, దినేశ్ కార్తీక్‌ల జట్ల పోటీని ఆదివారం వీక్షించవచ్చు.