Puri Jagannadh Upcoming Movie With Nagarjuna & Naga Chaitanya

2018-05-24 531

Nagarjuna, son Naga Chaitanya may join hands for Puri Jagannadh. Puri gave two hits to Nagarjuna in the fast
#PuriJagannadh
#Nagarjuna
#NagaChaitanya

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిభ గల దర్శకుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీని కుదిపేసిన పూరి ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయాడు. బద్రి, ఇడియట్, పోకిరి, చిరుత, టెంపర్ వంటి హిట్స్ ఈ దర్శకుడు ఖాతాలో ఉన్నాయి. కానీ ఇటీవల పూరి తెరకెక్కిస్తున్న చిత్రాలు ఆడియన్స్ కు కనెక్ట్ కావడం లేదు. పూరి తన కుమారుడు ఆకాష్ పూరితో తెరకెక్కించిన మెహబూబా చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. పూరిజగన్నాథ్ తదుపరి చిత్రాల గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి.
తాజగా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య తో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే పూరి ఈ ప్రతిపాదనని నాగ్ ముందు పూరి ఉంచాడట.
నాగార్జున ఈ చిత్రానికి సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ నాగార్జున, నాగ చైతన్యకు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాకే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున త్వరలో బంగార్రాజు చిత్రంతో బిజీ కాబోతున్నాడు.నాగచైతన్య పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.పూరి చిత్రం ప్రారంభం అయ్యేది ఏడాది చివర్లోనే అనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో నాగార్జునతో పూరి రెండు చిత్రాలు చేసాడు. ప్రేమకథగా వచ్చిన శివమణి, ఎంటర్టైనర్ గా వచ్చిన సూపర్ మంచి విజయాలు సాధించాయి. దీనితో పూరి, నాగ్ కాంబినేషన్ లో వచ్చే మూడో చిత్రంపై మంచి అంచనాలు ఉంటాయనడంలో సందేహం లేదు.