IPL 2018 : Reasons why Rajasthan Royals Lost To Kolkata Knightriders

2018-05-24 108

Kolkata Knight Riders, who secured the playoff spot in their last league match, upstaged the Rajasthan Royals to register a marvelous win.
#ipl2018
#ajinkyarahane
#rajasthanroyals
#kolkataknightriders

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 25పరుగుల తేడాతో ఓటమికి గురైంది. ఇలా జరగడంపై రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఆవేదన వ్యక్తం చేశాడు. ముందున్న లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ, ఛేదించడంలో విఫలమైయ్యామన్నాడు. దానికి కారణం కోల్‌కతా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్‌ చేయడమే అని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. 'ఆదిలోనే కోల్‌కతా కీలక ఆటగాళ్లను ఔట్‌ చేసి పైచేయి సాధించాం. అయితే కార్తీక్‌-శుభ్‌మాన్‌ గిల్‌లు చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేసి కోల్‌కతాను తేరుకునేలా చేశారు. మరొకవైపు రస్సెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడం కూడా మా విజయావకాశాలపై బాగా ప్రభావం చూపింది. కోల్‌కతా పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాణించిన తీరు అమోఘం. మా ముందు సాధారణ లక్ష్యం ఉన్నా దాన్ని ఛేజ్‌ చేయలేకపోయాం. ఇది చాలా బాధించింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతకుముందు లీగ్‌లో రాజస్తాన్ జట్టు కనబరిచిన ఆటతీరు గురించి విశ్లేషిస్తూ.. 'నేను, సంజూ శాంసన్‌ ఆడుతున్నంతసేపు మ్యాచ్‌ సానుకూలంగానే సాగింది. మేమిద్దరం స్పల్ప వ్యవధిలో ఔట్‌ కావడం మా ఓటమికి కారణం. ఓవరాల్‌గా మంచి క్రికెట్‌ ఆడాం. ఈ సీజన్‌లో మా బౌలింగ్‌ యూనిట్‌ లెక్కకు మించి శ్రమించింది. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం మెరుగుపడాల్సిన అవసరం ఉంది' అని రహనే తెలిపాడు.