Kamal Hassan Says About Savitri's Life

2018-05-24 2,965

Actor kamal hassan about Savitri. I learned acting from Savitramma says Kamal
#Savitramma
#kamalhassan

మహానటి సావిత్రి జీవితంలో ఎన్నో మధురజ్ఞాపకాలు, అదేస్థాయిలో చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆమె సినీజీవితం ఎందరికో ఆదర్శనీయం. విశ్వనటుడిగా ఎదిగిన కమల్ హాసన్ కూడా సావిత్రి నుంచే నటనలో ఓనమాలు నేచుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం విడుదల కావడంతో ఇప్పుడు అందరిలో ఆమె గురించే చర్చ జరుగుతోంది. జయప్రద, కమల్ మధ్య సాగిన ఇంటర్వ్యూ లో సావిత్రమ్మ అని సంభోదిస్తూ కమల్ చెప్పిన మాటలు కంటతడి పెట్టించేవిగా ఉన్నాయి.
సావిత్రమ్మకు తొలి బిడ్డ పుట్టక ముందు నుంచే నన్ను ఓ దత్త పుత్రుడిలా చూసేదని కమల్ హాసన్ అన్నారు. నటనలో ఆమె రాణి అని కమల్ అన్నారు. సావిత్రమ్మ నటన చూసి ఇప్పటికి ఆశ్చర్యపోతుంటానని అన్నారు.ఒక స్టార్ గా ఈమె ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగింది. నా జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయా అంటే లేవనే చెబుతాను. కానీ సావిత్రమ్మ ఎదుర్కొన్న ఒడిదుడుకులు కళ్లారా చూశానని కమల్ అన్నారు.
సావిత్రమ్మ కోసం కిళ్ళీ తీసుకురావడానికి మద్రాసు నగరంలో ఇంపాలా కార్లు వెల్లేవని కమల్ అన్నారు. అలాంటి సావిత్రమ్మని రోడ్డుపై టాక్సీ కోసం నిలబడి ఉండే స్థితిలో చూశానని కమల్ హాసన్ కంటతడి పెట్టుకున్నారు.
సావిత్రమ్మని పెద్ద స్టార్ గా ప్యాలెస్ లాంటి భవనాల్లో చూశా. అమావాస్య చంద్రుడు చిత్రంతో తాను నిర్మాతగా మారిన తరువాత తొలి చెక్ ని సావిత్రమ్మకు ఇద్దామని బయలుదేరా. సావిత్రమ్మ ఉంటున్న పెద్ద ఇల్లు గుర్తుంది. కానీ నన్ను మరో చోటికి తీసుకుని వచ్చారు. ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని చూస్తే అక్కడ చిన్న గదిలో సావిత్రమ్మ ఉంది.