Sri Reddy Leaked More Photos Of Daggubati Abhiram

2018-05-23 91

Sri Reddy leaked more photos of Daggubati Abhiram. "Easy to spoil a life, but difficult to built a life, stop destroying women's dreams and future..producers and directors and their sons and relatives are main here in the industry they are using girls flesh as their property..heros game is differnt chi..who wl come forward to protect us..we are in very situation..save us please..protect girl's independence..Indians and nris please wake up,take a step to help us..india need girl child..dnt abuse us we beg all of u men." Sri Reddy said.
#SriReddy
#DaggubatiAbhiram

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో తుఫాను రేపింది. శ్రీరెడ్డి దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం కదిలింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్.... అంటూ ఆమె మరిన్ని ఫోటోలు లీక్ చేశారు.
ఒకరి జీవితాన్ని నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడం చాలా కష్టం. సినిమా రంగంపై ఇష్టంతో తమ భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో ఇటు వైపు వస్తున్నారు. కానీ నిర్మాతలు, దర్శకులు, వారి కొడుకులు, బంధువులు అలా వచ్చే అమ్మాయిల పాలిటి విలన్స్‌లా దాపురించారు. అమ్మాయిల దేహాలను, వారి రక్తమాంసాలను తమ ఆస్తిలా భావిస్తున్నారు.... అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
ఇక అమ్మాయిల జీవితాలతో కొందరు హీరోలు ఆడుకునే తీరు భిన్నంగా ఉంటుంది. ఛీ.. ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా బాధేస్తుంది. మమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు? మేము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాపాడండి. అమ్మాయిల ఇండిపెండెంటును ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని శ్రీరెడ్డి తెలిపారు.
భారతీయులతో పాటు ఎన్ఆర్ఐలు ఈ విషయంలో మేల్కోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వారిని కాపాడటానికి దయచేసి ముందడుగు వేయండి. ఇండియాకు అమ్మాయిలు అవసరం. మమ్మల్ని కించపరచవద్దు. మగాళ్లందరినీ వేడుకుంటున్నాం... అంటూ శ్రీరెడ్డి తెలిపారు.