Nela Ticket Team Exclusive Chit Chat

2018-05-23 11,978

Mass Maharaja Ravi Teja’s next film release would be Nela Ticket. This friday movie coming theaters. The teaser of this entertainer has been released and it proves that the film will be a complete package for every Ravi Teja fan. Raviteja about the film nela ticket.
#NelaTicket
#Raviteja

రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 25)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంధర్భంగా మాస్ మహారాజ రవితేజతో ఇంటర్వ్యూ..
నేలటిక్కెట్టు అనే పదం మాస్‌ పదంలా అనిపించవచ్చు కానీ ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చే అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరో చాలా సరదా సరదాగా కనిపిస్తాడు. అందరికి నచ్చే విధంగా ఉంటాడు.
నేను చిన్నప్పుడు చాలా సినిమాలను నేల టికెట్ లోనే చూసాను. ఎందుకంటే.. ఒక్క బాల్కాని టికెట్ తో నాలుగు నేల టికెట్ సినిమాలు చూడొచ్చు కావున. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ అని అందరు అంటారు.
నేల టికెట్ అనే టైటిట్‌ మాత్రమే మాస్‌గా అనిపిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీసిన 'సొగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి. ఆ తరువాత తీసిన రారండోయ్ వేడుక చూద్దాం బాగా క్లాస్ గా ఉంటుంది. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇది హండ్రెడ్‌ పర్సెంట్‌ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీ.
నేల టికెట్ సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. చుట్టూ జనం, మధ్యలో మనం అనే కాన్సెప్ట్ తో సినిమా ఉంటుంది. జనం కోసం తపించే పాత్రలో నేను చెయ్యడం జరిగింది. కళ్యాణ్ కృష్ణ ఈ కథ ఎలా రాసుకున్నాడో అలాగే తియ్యడం జరిగింది.