Kohli Is My Favorite Cricketer, Says Kareena Kapoor

2018-05-23 742

Virat Kohli is loved by many across the world, and the cricketer has found a fan in Kareena Kapoor Khan too. In promotion of Veere Di Wedding, She confessed that he finds Virat Kohli hot. Kareena will be next seen in Veere Di Wedding along with Sonam Kapoor, Swara Bhasker and Shikha Talsania.
#VeereDiWedding
#ViratKohli

బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో సోనమ్ కపూర్, స్వర భాస్కర్, షికా తల్సానియా‌తో కలిసి ఆమె నటిస్తున్నారు. జూన్ 1 రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్‌లో కరీనా బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కశర్మ భర్త, క్రికెటర్ విరాట్‌పై కరీనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.
వీర్ ది వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా హాట్. చాలా ఫిట్‌గా ఉంటాడు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్ నటుడు కేన్ విలియమ్సన్ అంటే కూడా తనకు బాగా ఇష్టం. అతడు కూడా హాట్‌గా ఉంటాడు అని కరీనా పేర్కొన్నారు. దీంతో అనుష్కకు పోటీ మొదలైందనే వార్తలు వినిపించాయి.
అలాగే తన భర్త సైఫ్ ఆలీ ఖాన్ కూడా అంతే మొత్తంలో ఫిట్‌గా, హాట్‌గా ఉంటాడు అని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన భర్త జూనియర్ పటౌడీ అంటే తనకు చాలా ప్రేమ. ఆయన తనను బాగా చూసుకొంటారు అని కరీనా చెప్పారు.