IPL 2018: Preity Zinta wants CSK to win the title

2018-05-23 238

However, despite her team's loss, Preity Zinta is now backing the MS Dhoni-led Chennai Super Kings to win the title. Important to note here that Chennai Super Kings came back to the IPL this season.
#preityzinta
#kingselevenpunjab
#chennaisuperkings
#ipl2018

పంజాబ్ జట్టు ఈ సీజన్ ఆరంభంలో దూకుడుగా ఆడి మొదటి 6 మ్యాచ్‌లకు గాను ఐదింటిలో గెలిచి వైభవంగా అడుగులేసింది. క్రమంగా వైఫల్యాలు చుట్టుముట్టడంతో ఆఖరి మ్యాచ్ చెన్నైతో ఆడి ఓటమికి గురై లీగ్ దశ నుంచి నిష్క్రమించి ఇంటికి చేరింది. ఈ దశలో వైఫల్యాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్న జట్టు సహ యజమానురాలు ప్రీతి జింతా.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ గెలవాలని కోరుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చెన్నై అభిమానులకు, ధోనీ అభిమానులకు ఆసక్తికరమైన ఓ సందేశాన్ని పంపింది. 'మేము ఆడనంత వరకూ నాకు ప్రతి జట్టూ ఇష్టమే. కానీ, ధోనీకి వీరాభిమానిని కాబట్టి చెన్నై జట్టే గెలవాలనే కోరుకుంటున్నాను' అని పోస్టు చేసింది.
ఈ సీజన్‌లో ప్రీతిజింతా పలుమార్లు వివాదాలకు తావిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వేలంలో చిరునవ్వులు చిందిస్తూ. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత స్టేడియంలో టీ షర్టులు పంచి పెడుతూ.. మ్యాచ్ జరుగుతుండగా ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ కెమెరా కన్నుల్లో మెరుస్తూ ఉండేది.