NTR’s Aravinda Sametha Movie Dialogue Leaked

2018-05-23 2

The first look of Jr NTR’s upcoming film with director Trivikram Srinivas was revealed along with its title to coincide with the star’s birthday on May 20. After Jai Lava Kusa's success, Jr NTR is back to work on his next film with Trivikram.
#Aravinda sametha
# JrNTR

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు అర‌వింద స‌మేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. పూజా హెగ్డే చిత్ర సెట్స్ లో పాల్గొనడం జరిగింది.
సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ఈ సినిమా పొలిటికల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ఒక డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ''అన్నా మాది రాయలసీమ.. నమ్మితే ప్రాణాలు ఇస్తాం.. నమ్మకద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం''. ఈ డైలాగ్ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చెప్పబోతున్నట్లు సమాచారం.
తాజాగా అరవింద సమేత సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ వేశారట. కొన్ని కీలక సన్నివేశాలు ఈ సెట్స్ లో షూట్ చేసినట్లు సమాచారం. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నారు.