Director Shankar IPL Twitter Comments Goes Controversial

2018-05-23 1,636

Director shankar gets trolled for his tweet. Thoothukudi incident is hot topic in Kollywood
#Directorshankar
#Kollywood

తమిళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం పోరాటాల మయంగా మారుతోంది. తమిళ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమ వెంటనే ఆ పోరాటంలో పాల్గొంటోంది. స్టెరిలైట్ కాపర్ సంస్థ విస్తరణని వ్యతిరేకిస్తూ దాదాపు 50 వేలమంది జనం తమిళనాడులో పోరాటం చేస్తున్నారు. 100 రోజులుగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం మంగళవారం రోజు హింసాత్మకంగా మారింది.కలక్టరేట్ వద్ద జరిగిపిన నిరసనలో పోలీసులు కాల్పులు జరపడం 11 మంది మరణించడం జరిగింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో స్టార్ డైరెక్టర్ శంకర్ తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.
మంగళవారం రోజు ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని ఉద్దేశించి శంకర్ వాట్ ఏ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. దీనితో శంకర్ పై తమిళ జనం విమర్శలతో విరుచుకుపడుత్నారు. మనుషుల ప్రాణాలు పోతుంటే క్రికెర్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు.
విమర్శల తాకిడిని శంకర్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ ట్వీట్ ని తొలగించిన శంకర్ తాజాగా తూత్తుకుడి ఘటనపై ట్వీట్ చేసారు. ఇది అత్యంత భాదాకరమైన ఘటన అని, మరణించిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ శంకర్ ట్వీట్ చేశారు.