Tammareddy Bharadwaj Comments on Keerthy Suresh. He compares Mahanati with Bahubali
#Mahanati
#Bahubali
#TammareddyBharadwaj
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో సినీ రాజకీయ అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీలో ఏ వివాదం చోటు చేసుకున్నా తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.
2014 లో విడుదలైన బాహుబలి తొలి భాగం చూశాను. తనకు అంతగా నచ్చలేదని తమ్మారెడ్డి అన్నారు. థియేటర్ బయటకు వచ్చి బాగాలేదని చెబితే కొడతారని భయం వేసి బావుందని చెప్పా అని తమ్మారెడ్డి తెలిపారు.
నచ్చలేదని చెబితే కొట్టేంతలా జనాలకు బాహుబలి నచ్చేసింది. బాహుబలి చిత్రం మ్యాజిక్ చేసింది. మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగం మ్యాజిక్ చేసిందని తమ్మారెడ్డి అన్నారు.
ఇటీవల విడుదలైన మహానటి చిత్రం గురించి తమ్మారెడ్డి స్పందించారు. ఇప్పుడు ఎక్కడా చూసినా అంతా మహా నటి చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారని తమ్మారెడ్డి తెలిపారు. ఈ చిత్రం మే 9 న బుధవారం విడుదలైంది. బుధవారం విడుదలైన చిత్రం గురువారం తగ్గిపోవాలి. కానీ రోజు రోజుకు ఈ చిత్ర వసూళ్లు పెరుగుతూ వచ్చాయని తమ్మారెడ్డి అన్నారు.
బయోపిక్ చిత్రాన్ని పిలాసఫికల్ గా చెప్పడం చాలా కష్టం. కానీ ఆ పనిని నాగ అశ్విన్ అద్భుతంగా చేసాడని తమ్మారెడ్డి అన్నారు.
సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందని తమ్మారెడ్డి అన్నారు. సినిమా చూస్తున్న మూడు గంటలే మరే ఆలోచన రాలేదని తమ్మారెడ్డి అన్నారు.