Anasuya Bharadwaj Trip With Family

2018-05-22 2,577

LehLadakh !! You beauty!!! An experience for life!!! I’ve decided I would experience INDIA once in a year for sure!!! #IncredibleIndia #Proud of its resources, cultures, traditions and diversity" Anasuya tweeted.
#AnasuyaBharadwaj
#Anasuyatweeted
#Ladakh

హైదరాబాద్‌లో ఎండలు మండి పోతుండటంతో బిజీ బిజీగా సాగే తన వర్క్ షెడ్యూల్ నుండి కాస్త గ్యాప్ తీసుకుని చిల్ అయ్యేందుకు హిమాలయాకు వెళ్లింది యాంకర్ అనసూయ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ లడఖ్ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబందించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానుతో పంచుకున్నారు. ఇకపై ఏడాదిలో ఒక్కసారైనా ఇండియాలోని కొత్త ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు అనసూయ తెలిపారు.
ఇంక్రెడబుల్ ఇండియాను చూసి గర్వపడుతున్నాను. అపారమైన ప్రకృతి వనరులు, భిన్న సంస్కృతులు, ఆచారాలకు నెలవైన ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం అంటూ అనసూయ ఈ సందర్భంగా తన పోస్టులో పేర్కొన్నారు.
లేహ్ అఢఖ్ వద్ద ప్రకృతి సౌందర్యాన్ని చూసిన ఈ చలాకీ యాంకర్ ఆనందంతో గంతులేశారు. తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ లఢఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారుసోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే అనసూయ తన పర్యటనకు సంబంధించిన సెల్ఫీ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తున్నారు.