Finishing top of the league table equals IPL crown? Think again. An analysis of the past 10 seasons throws this up.
#IPL2018
#ChennaiSuperKings
#Kolkata
#DeccanChargers
#SunrisersHyderabad
ప్లేఆఫ్ దశకు చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరేట్‌గా మంగళవారం రాత్రి సన్‌రైజర్స్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే.. గత గణాంకాలు ధోనీ సేనకే సానుకూలంగా ఉన్నాయి. గత పదేళ్లలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ చేరిన జట్టే ఐదుసార్లు కప్ సొంతం చేసుకుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలచిన జట్టు రెండు పర్యాయాలు మాత్రమే కప్ గెలిచింది. 2008లో రాజస్థాన్, గత ఏడాది ముంబై నెంబర్-1 నిలిచి కప్ కొట్టాయి. అలాగే అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏడుసార్లు ఫైనల్ చేరింది.
గతంలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై (2011), కోల్‌కతా (2011, 2014), ముంబై ఇండియన్స్ (2013, 2015) ఐపీఎల్ కప్ గెలవగా.. ఏడుసార్లు ఫైనల్ చేరాయి.
మూడో స్థానంలో నిలిచిన జట్లు రెండుసార్లు కప్ గెలిచాయి. నాలుగుసార్లు ఫైనల్ చేరాయి. 2010లో చెన్నై, 2016లో హైదరాబాద్ ఇలాగే కప్ సొంతం చేసుకున్నాయి.
నాలుగో స్థానంలో నిలిచి గత పదేళ్లలో కప్ గెలిచిన ఏకైక జట్టు డెక్కన్ ఛార్జర్స్. నాలుగో స్థానంలో నిలిచిన జట్టు రెండుసార్లు ఫైనల్ చేరింది.