Bharat Ane Nenu latest Box office collections report. 100 cr movie for Mahesh
#BharatAneNenu
#maheshbabu
#boxofficecollections
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ ముఖ్యమంత్రిగా మహేష్ నటనతో అదరగొట్టాడు. మహెష్ బాబు వన్ మాన్ షోలా ఈ చిత్రం సాగింది. పొలిటికల్ చిత్రం అయినప్పటికీ దర్శకుడు కొరటాల అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళని సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రం నెలరోజుల్లోనే 100 కోట్ల షేర్ సాధించింది. 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మహేష్ కెరీర్ లో ఇదే అత్యధిక వసూళ్లు అన్ని చెప్పవచ్చు.
తాజా వివరాల ప్రకారం భరత్ అనే నేను చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇందులో తెలుగురాష్ట్రాల షేర్ 73 కోట్లు ఉంది. శ్రీమంతుడు వంటి ఘనవిజయం తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలతో కొన్ని ఏరియాలలో స్థాయికి మించి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
భారీ అంచనాలతో అంతే భారీగా జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ వలన కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ కు కొంత మేర నష్టం తప్పేలా లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినప్పటికీ భారీ ప్రీరిలీజ్ బిజినెస్ వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.