Delhi Daredevils Cautioned For Inviting Cheergirls To Dinner Event

2018-05-22 182

Delhi Daredevils were cautioned by BCCI’s anti-corruption unit (ACU) for inviting cheerleaders to a celebrity golf tournament dinner in Gurgaon ahead of their match against the Chennai Super Kings last Friday.

లీగ్ దశతో సరిపెట్టుకుని ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మరో కలంకం వచ్చి పడింది. ప్లేఆఫ్ రేసుకు అర్హత కోల్పోయాక ఢిల్లీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు విందు ఏర్పాటుచేసింది. తమతో పాటు చీర్ గర్ల్స్‌కు కూడా పార్టీకి ఆహ్వానించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం చీర్‌ గర్ల్స్‌.... జట్టుకు సంబంధించిన ఏ ప్రైవేటు కార్యక్రమంలోనూ పాల్గొనకూడదు. కానీ, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దానిని అతిక్రమించింది.
తాజాగా ఆ అమ్మాయిలను డిన్నర్‌కు ఆహ్వానించినందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యంపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు ఫ్రాంఛైజీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రస్తుతానికి బీసీసీఐకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు కానీ లీగ్‌ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ ఇచ్చే నివేదికలో మాత్రం దీన్ని చేరుస్తామని అధికారులు తెలిపారు.
ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చోటు చేసుకున్నప్పటి నుంచి బయటి వ్యక్తులు జట్టును కలవకూడదన్న నిబంధనను మరింత కఠినతరం చేశారు. అప్పటి నుంచి ఆటగాళ్లు పాల్గొనే ఏ ప్రైవేటు కార్యక్రమంలోనైనా బయట వ్యక్తులు హాజరుకాకూడదు.