Kohli Doesn't Exercise Influence On Policy-Making, Says CoA Chief Vinod Rai

2018-05-22 77

Virat Kohli's aura in Indian cricket has grown exponentially over the past few years but contrary to popular perception, he has never wielded "disproportionate influence" when it comes to policy decisions, says Committee of Administrators (COA) chief Vinod Rai.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విధానపర నిర్ణయాల్లో తమపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీవోఏ) (పాలకుల కమిటీ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపాడు.
ఢిల్లీలోని జిమ్‌ఖానాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాయ్, విరాట్‌పై ప్రశంసలు కురిపిస్తూ పలు అంశాలపై మాట్లాడాడు.
టీమ్ మేనేజ్‌మెంట్‌పై గానీ, సెలక్టర్లపై గానీ అతను ఏ విషయంలోనూ ఒత్తిడి చేయలేదు. కోహ్లీ ఒత్తిడి తీసుకురావడం వల్లే ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేశారంటూ అప్పట్లో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే అని రాయ్ తెలిపాడు.
‘ప్రతి కెప్టెన్‌కు జట్టుపై కొంత అధికారం ఉంటుంది. జట్టు బాధ్యతలు మోయాల్సింది అతనే. దీంతో పరిమితులకు లోబడి అతడికి విచక్షణ, స్వేచ్ఛ ఇవ్వడాన్ని సమర్థిస్తాన'ని రాయ్‌ పేర్కొన్నారు.
మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు కూడా ఎప్పూడూ కోహ్లీపై ఫిర్యాదు చేయలేదన్నారు. సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఎటువంటి ఒత్తిడులకూ లొంగే రకం కాదన్నారు. కోహ్లీని కౌంటీలు ఆడేందుకు అనుమతించడం వెనుక కారణాన్ని వివరించారు. సౌతాఫ్రికా టూర్‌లో ఎదురైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంగ్లండ్‌ వాతావరణానికి అలవాటుపడాలనే ఈ విధంగా చేశామన్నారు.
ఒకసారి జట్టు ఎంపిక విషయంలో ఎమ్మెస్కే కాస్త ఒత్తిడిలో కనిపించాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ప్రతిభ ఆధారంగానే జట్టును ఎంపిక చేయాలని నేను అతనికి సూచించాను. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు జట్టు ఎంపిక చేసినపుడూ నేను, డయానా ప్యానెల్‌లో కూర్చోనేలేదు. ఎమ్మెస్కేపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ మేము టీమ్ మేనేజ్‌మెంట్, ఇండియా కోచ్ ద్రవిడ్‌తో చర్చించాకే ఆ నిర్ణయం తీసుకున్నాం.