IPL 2018 : Never Expected I Would Be Picked Up In The Auction: Ngidi

2018-05-22 69

When South African pacer Lungi Ngidi came in to bowl the second over for Chennai Super Kings on Sunday, he was in for a pleasant surprise.

వివాదాల అనంతరం నిషేదానికి గురై మళ్లీ దక్షిణాఫ్రికా టెస్టులోకి పునరాగమనం చేశాడు ఎంగిడి. ఐపీఎల్‌ వేలంలో అతడిని చెన్నై కొనుగోలు చేసింది. అతనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఐపీఎల్ 11వ సీజన్‌లో ఆడలేనంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు విరామం అనంతరం జట్టులోకి అడుగుపెట్టాడు. 2018 సీజన్‌‌లో సంచలన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి వెలుగులోకి వచ్చాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఎంగిడి.. 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 153 పరుగులకే పంజాబ్‌ ఆలౌటవగా.. లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే చెన్నై ఛేదించేసింది.
'పుణె పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకి బాగా సహకరించింది. నా కంటే ముందు తొలి ఓవర్ వేసిన దీపక్ చాహర్‌.. బౌన్స్, స్వింగ్ రాబట్టడంతో నాలో ఉత్సాహం పెరిగింది. బౌలింగ్‌ కోసం బంతి నాకు ఇవ్వగానే.. నా సహజ శైలిలో బౌలింగ్ చేశాను. ఆఫ్ స్టంప్‌కి కొద్దిగా దూరంగా బంతులు విసరడం.. అవి స్వింగ్‌ అవుతున్న దశలో బ్యాట్స్‌మెన్ వాటికి దొరికిపోవడం చకచకా జరిగిపోయాయి. అని తెలిపాడు.